ఈనాటి ముఖ్యాంశాలు

22 Nov, 2019 20:17 IST|Sakshi

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకంలో మిగిలిపోయామని ఎవరైనా భావిస్తే వారు బాధపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. కార్మికులను బేషరుతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో కార్మికులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మెనే విరమించే ప్రసక్తేలేదని, సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. పౌరసత్వం రద్దు కేసులో హైకోర్టును ఆశ్రయించిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు ఊరట లభించింది. ఏఐఎమ్‌ఐఎమ్‌ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీపై సైదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కెనడా కొత్త క్యాబినెట్‌లో తొలిసారిగా ఓ హిందూ మహిళకు అవకాశం లభించింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా