రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే లోకల్‌ అభ్యర్థిత్వం

3 Aug, 2019 17:47 IST|Sakshi

సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీలో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే లోకల్‌ అభ్యర్థిత్వం అమలు జరుగుతుందని, ఆ ఉత్తర్వుల్లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో వాటిని అమలు చేస్తామని పంచాయితీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయటానికి శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పని సరిగా గ్రామస్థాయిలో నివాసం ఉండాలన్నారు. పెళ్లై జిల్లా మారిన మహిళా అభ్యర్థులను నాన్‌ లోకల్‌గా పరిగణిస్తామన్నారు. నాన్‌లోకల్‌గా మూడు జిల్లాల్లో దరఖాస్తు చేసుకునే వీలు ఉందన్నారు. పదవ తరగతికి ముందు ఏడేళ్ల కాలంలో ఎక్కడ ఎక్కువ కాలం చదివితే అదే జిల్లా లోకల్‌ అవుతుందని పేర్కొన్నారు.

ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 10 అర్థరాత్రి ఆఖరు తేదీ అని, సెప్టెంబర్‌ 1న రాత పరీక్ష ఉంటుందని తెలిపారు. తదనంతరం 15 రోజుల్లో ఫలితాలు వెలువడతాయని చెప్పారు. రాత పరీక్ష ఆధారంగానే నియామక పక్రియ ఉంటుందని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, దరఖాస్తులో  సంతకం కంపల్సరీగా స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఏపీలో గ్రామ స్థాయిలో పెనుమార్పులు రాబోతున్నాయని చెప్పారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సందేహాల నివృత్తి కోసం క్రింది ఫోన్‌ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

సంప్రదించవల్సిన ఫోన్‌ నెంబర్లు :
ఫోన్‌ :  91212 96051, 91212 96052, 91212 96053
ఫోన్‌ : 91212 96054, 91212 96055

>
మరిన్ని వార్తలు