వైకుంఠ దర్శనం: పోటెత్తిన భక్తులతో తిరుమల కిటకిట

25 Dec, 2023 09:37 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. నేడు(సోమవారం) త్రయోదశి శ్రీవారి దర్శనం కోసం భక్తులు కిటకిటలడుతున్నారు. వరుసగా సెలవులు నేపధ్యంలో దర్శనానికి  భక్తులు బారులు తీరారు. త్రయోదశి సందర్భంగా  ప్రముఖులు శ్రీవారి దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు జడ్జి కృపాసాగర్, సుప్రీంకోర్టు జడ్జ్ నాగరత్నం, హైకోర్టు జడ్జ్ కే సురేష్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్‌  ఎమ్మెల్యే రోహిత్, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత శ్రీవారిని దర్శించుకున్నారు.

వైకుంఠ ద్వాదశి నాడు(ఆదివారం) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,519. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,424. ద్వాదశి నాడు శ్రీవారి హుండీ ఆదాయం 5.05 కోట్లు వచ్చింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రొజల్లో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 131,425. ఏకాదశి, ద్వాదశి రెండు రోజుల్లో హుండీ ఆదాయం 7.55 కోట్లు వచ్చింది. తిరుపతిలో కేటాయిస్తున్న ఉచిత వైకుంఠ ద్వార దర్శన టికెట్లు పూర్తి అయ్యాయి. 53 గంటల్లో  తిరుమల తిరుపతి దేవసస్థానం(టీటీడీ) 4,23,500 టికెట్లు జారీ చేసింది. 

ముగిసిన వైకుంఠద్వార దర్శనం టోకెన్ల కోటా
ఈనెల 22 రాత్రి 11:30 నుంచి టోకెన్లు జారీ చేసిన టీటీడీ 4.25 లక్షల భక్తులకు వైకుంఠద్వార దర్శన టోకెన్లు జారీ చేసింది. టైమ్ స్లాట్, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. రోజూ 65 వేల మందికి పైగా భక్తులకు వైకుంఠద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఈనెల 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార భక్తులు దర్శనం చేసుకోవచ్చు.

నంద్యాల(శ్రీశైలం): శ్రీశైలం మల్లన్న ఆలయంలో రెండోవరోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా సెలవులు  వచ్చిన నేపథ్యంలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో క్షేత్రమంత భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది.

>
మరిన్ని వార్తలు