'సీమాంధ్ర ఉద్యమానికి దీటుగా కార్యక్రమాలు చేద్దాం'

4 Oct, 2013 18:51 IST|Sakshi

మెదక్: సీమాంధ్ర ఉద్యమానికి దీటుగా కార్యక్రమాలు నిర్వహించాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఫాం హౌస్ లో టీఆర్ఎస్ నేతలతో భేటీ అయిన కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ తీర్మానం ఆమోదం పొందేవరకు తెలంగాణ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీమాంధ్ర ఉద్యమానికి దీటుగా తెలంగాణలో కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ సూచించారు.

 

అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్రంగా వడిగా అడుగులు వేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ అంశంపై కూడా పార్టీ నేతలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. కాగా, నవంబర్‌ నెలాఖరు కల్లా తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో తప్పక ఆమోదం పొందగలదని కేసీఆర్ భావిస్తున్నారు. బిల్లుకు సంబంధించిన మొత్తం పనులు చాపకింద నీరులా పూర్తవుతున్నాయన్నారు. అయితే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణవాదులకు సూచించారు.

మరిన్ని వార్తలు