పిడమర్తి రవిని నేనే రమ్మన్నా: కేసీఆర్

12 Mar, 2014 16:40 IST|Sakshi
పిడమర్తి రవిని నేనే రమ్మన్నా: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ పునర్మిర్మాణం అనేది జీవన్మరణ సమస్యగా మారిందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించాల్సిన అవసరముందని కేసీఆర్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే వై.ఎల్లారెడ్డి, వరంగల్ జిల్లా టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రేమలతారెడ్డి, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి టీఆర్ఎస్లో చేరారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... మక్తల్ నియోజకవర్గంలో ఎల్లారెడ్డికి మంచి పేరువుందని అన్నారు. పిడమర్తి రవిని తానే పార్టీలోకి ఆహ్వానించానని, తనను తానుగా ఆయన రాలేదన్నారు. మంచి స్థానంలో రవిని ఎమ్మెల్యేగా పోటీకి పెడతానన్నారు. లక్ష ఓట్లతో మెజారిటీతో ఆయనను గెలిపించాలన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు