తుంగ.. తీరనున్న బెంగ

16 Jul, 2018 09:18 IST|Sakshi

ప్రస్తుతం 76,527 క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లో

72 టీఎంసీలకు చేరిన నీటిమట్టం  

రెండురోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం

నేడు టీబీ బోర్డు కీలక సమావేశం

అనంతపురం సెంట్రల్‌: తుంగభద్ర జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతోంది. జలాశయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 76,527 క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లోతో వరదనీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రస్తుతం జలాశయం 72 టీఎంసీల నీటిమట్టానికి చేరుకుంది. ఈక్రమంలోనే కాలువలకు నీళ్లు వదిలేందుకు ముహూర్తం ఖరారు చేసేందుకు సోమవారం తుంగభద్ర జలాశయం బోర్డు అధికారులు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేటి సాయంత్రంలోపు నీటి విడుదల విషయంపై తీపి కబురు జిల్లా రైతాంగానికి అందనుంది. 

నాలుగేళ్ల తర్వాత
రైతాంగానికి వరప్రదాయినిగా ఉన్న తుంగభద్ర జలాశయంలో  నాలుగేళ్ల నుంచి ఆశించిన స్థాయిలో నీళ్లు చేరకపోవడంతో మాగాణి భూములు బీళ్లుగా మారాయి. ఈసారి జిల్లాలో రైతులు ఆకాశం వైపు చూస్తుంటే.. కర్ణాటకలో మాత్రం వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో తుంగభద్ర జలాశయానికి Výæతంలోఎన్నడూ లేని విధంగా 76, 527 క్యూసెక్కుల మేరవరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం మట్టం ఆదివారం నాటికి 72 టీఎంసీలకు ఎగబాకింది. 

మూడురోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం
140 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన తుంగభద్ర జలాశయంలో భారీగా పూడిక చేరింది. దీంతో జలాశయం సామర్థ్యం 100 టీఎంసీలకు పడిపోయింది. ఆదివారం నాటికి జలాశయంలోకి 72 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. అయితే భారీ ఇన్‌ఫ్లో ఉండడంతో బుధు, గురువారం నాటికి 100 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకునే అవకాశముందని హెచ్చెల్సీ అధికారులు భావిస్తున్నారు. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేసే అవకాశముందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం కీలక సమావేశాన్ని టీబీబోర్డు నిర్వహిస్తోంది. 

మరిన్ని వార్తలు