అంకుల్‌.. అంకుల్‌..సార్‌.. సార్‌

6 Apr, 2019 10:07 IST|Sakshi
పోలింగ్‌ సెంటర్‌లోకి వెళ్లేందుకు  డీఎస్పీతో వాదిస్తున్న టీడీపీ అభ్యర్థి సూరి తనయుడు నితిన్‌ సాయి

సాక్షి, ధర్మవరం : పట్టుమని పద్దెనిమిదేళ్లు కూడా ఉండవు ఆ యువకునికి.. అధికార పార్టీ అండ చూసుకొని అధికారులను సైతం నిబంధనలకు విరుద్ధంగా తన చెప్పుచేతల్లో ఉంచుకునేలా వ్యవహరిస్తుంటే.. డివిజన్‌ స్థాయి పోలీసు అధికారి సైతం అతన్నే ‘బాస్‌’లా భావిస్తూ ‘సార్‌..సార్‌’ అని సంబోధిస్తుండడాన్ని చూసి అక్కడున్నవారు అవాక్కయ్యారు. అతనేమో డివిజన్‌ స్థాయి పోలీసు అధికారిని కూడా ‘అంకుల్‌.. అంకుల్‌’ అని పిలవడం.. ఆ అధికారి మాత్రం తన స్థాయిని, ఎన్నికల నియమావళిని మరిచి ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పూర్తి స్థాయిలో గౌరవాన్ని ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.

ఎవరతను.. ఇదంతా ఎక్కడ జరిగిందనుకుంటున్నారా..?  అదెక్కడో కాదు.. ధర్మవరం పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో చోటుచేసుకున్న సన్నివేశం ఇది. ధర్మవరం నియోజకవర్గ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులకు తహసీల్దార్‌ కార్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. అధికారిక హోదాలో అక్కడికి వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తనయుడు గోనుగుంట్ల నితిన్‌సాయికి పోలీసులు, ఎన్నికల అధికారులు సైతం రాచమర్యాదలు చేశారు. ఏకంగా గోనుగుంట్ల నితిన్‌సాయి ఫెసిలిటేషన్‌ సెంటర్‌లోకి దూసుకుపోతున్నా.. ఉద్యోగులను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నా అధికారులు మిన్నకుండిపోవడం గమనార్హం.  

మరిన్ని వార్తలు