అధికారమే శాశ్వతం అనుకోవద్దు: ఉండవల్లి

1 Oct, 2019 14:30 IST|Sakshi

సాక్షి, అమరావతి: రివర్స్‌ టెండరింగ్‌తో ఇంత భారీ తేడా వస్తుందని ఊహించలేదు.. ఆశ్చర్యపోయాను అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌. మంగళవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిజాయతీగా పని చేసేందుకు ప్రయత్నిస్తుందని ప్రశంసించారు. ఏ పని ఇచ్చినా జ్యూడిషియల్‌గా ఫాలో అప్‌ చేసి ఇస్తుండటం మంచి పరిణామం అన్నారు. మేఘా కృష్ణా రెడ్డి కంపెనీ రూ.700 కోట్లు తక్కువకు టెండర్‌ చేయడానికి ఎలా ముందుకు వచ్చారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కింది స్థాయిలో అవినీతి ఉంది.. దాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలని ఉండవల్లి కోరారు.

అందరు నిజాయతీగా పని చేయక తప్పదనే పరిస్థితి తీసుకురావలన్నారు ఉండవల్లి. పాలనలో పూర్తి పారదర్శకత తీసుకురావడానికి ప్రయత్నించాలని సూచించారు. 57 శాతం పైగా ఓట్లతో అధికారంలోకి వచ్చారు.. అదే శాశ్వతం అనుకోవద్దని ఉండవల్లి హెచ్చరించారు. ప్రజల్లో మంచి పేరుతో పాటు.. తనతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలను సంతృప్తి పరచడం జగన్‌ విధి అన్నారు. ఎమ్మెల్యేలపై నమ్మకం ఉంచి జాగ్రత్తగా వ్యవహరించమని కోరారు. జగన్‌ ఒక్కడిగా వచ్చాడు.. ఒక్కడిగా నడిపించాడు.. ఇప్పుడు తేడా రానివ్వొద్దన్నారు. ప్రభుత్వంపై సీరియస్‌గా ఆరోపణలు చేయడానికి ఇంకా సమయం ఉందని తెలిపారు.

మరిన్ని వార్తలు