ప్యాకేజీ ఇవ్వాలని సీఎం అనడం సరికాదు: వీహెచ్‌

15 Jul, 2013 14:30 IST|Sakshi
ప్యాకేజీ ఇవ్వాలని సీఎం అనడం సరికాదు: వీహెచ్‌

హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు సంబంధించి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దశలో అడ్డుతగలడం సరికాదని కాంగ్రెస్‌ ఎంపీ వి.హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. దాదాపు రెండున్నర ఏళ్లుగా సీఎంగా ఉన్న కిరణ్కుమార్ రెడ్డి ఇప్పుడు తెలంగాణకు  ప్యాకేజీ గురించి మాట్లాడటం సబబు కాదని ఆయన సోమవారమిక్కడ అన్నారు. ఆ ప్యాకేజీ ఏదో వాళ్లు తీసుకొని అద్భుతమైన రాజధానిని నిర్మించుకోవాలని హితవు పలికారు.  అవసరమైతే ఆ ప్యాకేజీకి   తాము మద్దతు తెలుపుతామని వి.హనుమంతరావు తెలిపారు.  

వెయ్యిమంది చనిపోయాక సమైక్యంగా ఉండటం సాధ్యం కాదని వీహెచ్ అన్నారు. తెలుగు ప్రజల మధ్య సీమాంధ్ర నేతలు చిచ్చు పెట్టడం సరికాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను పట్టించుకోరన్నది కేసీఆర్ భయమని వీహెచ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే కేసీఆర్ వెంట ఆయన కుటుంబం తప్ప ఎవరూ ఉండరని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు