జగన్‌ను కలిసిన వెలుగు యానిమేటర్లు

30 Nov, 2017 15:38 IST|Sakshi

సాక్షి, కైరుప్పల : ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని గురువారం వెలుగు యానిమేటర్లు కలిశారు. డ్వాక్రా సంఘాలను టీడీపీ సర్కార్‌ నిర్వీర్యం చేసిందని, యానిమేటర్లకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యానిమేటర్లకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని అన్నారు. అధికారంలోకి వచ్చాక వెలుగు యానిమేటర్లకు నెలకు రూ.10వేలు జీతం ఇస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పొదుపు సంఘాలు చంద్రబాబు సర్కార్‌ హయాంలో నిర్వీర్యం అయ్యాయి. అలాంటి పొదుపు సంఘాలను నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న యానిమేటర్లు... తమ జీతాలు పెంచాలని కోరుతున్నారు. పక్కన తెలంగాణలో రూ.5వేలు ఇస్తున్నారని, కనీస పారితోషికం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడిగినా ఫలితం లేదు.  వైఎస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే అయిదు వేలు కాదు... రూ.10వేలు ఇస్తాం.’  అని తెలిపారు. వైఎస్‌ జగన్‌ హామీతో పొదుపు సంఘాల యానిమేటర్లు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు