నల్లధనం అరికట్టే వ్యవస్థ ఉందా?

12 May, 2015 01:14 IST|Sakshi
నల్లధనం అరికట్టే వ్యవస్థ ఉందా?

సాక్షి, న్యూఢిల్లీ: నల్లధనం అరికట్టడానికి మన దగ్గర సరైన వ్యవస్థ ఉందా? అని వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు లోక్‌సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తులపై పన్ను విధించే బిల్లుపై సోమవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘రిటర్నులు దాఖలు చేయనివారికి రూ. 10 లక్షల పరిహారం విధించారు. అయితే ఈ నిబంధన అమలుచేసేందుకు వీలుగా మన వద్ద వ్యవస్థ ఉందా?’ అని ప్రశ్నించారు. అలాగే బిల్లులోని నియమ, నిబంధనల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ.. పటిష్ట అమలుకు తగిన సూచనలు ప్రభుత్వానికి ఇచ్చారు. 

మరిన్ని వార్తలు