ప్రకాశం బ్యారేజ్‌కు భారీ వరద.. హైఅలర్ట్‌ ప్రకటన

13 Aug, 2019 07:55 IST|Sakshi

పులిచింతల ప్రాజెక్టులోని 14 గేట్లు ఎత్తివేత

ప్రకాశంకు భారీగా చేరుతున్న వరద

చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ

సాక్షి, సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం  ఉదయం పులిచింతల ప్రాజెక్టులోని 14 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, సాగర్‌ గేట్లను పూర్తిగా ఎత్తడంతో ప్రస్తుతం 152 అడుగులకు చేరింది. దీంతో దిగువన గల ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద చేరుతోంది. బ్యారేజ్‌లో ఇప్పటికే పది అడుగుల మేర నీరు చేరింది. 12 అడుగులకు నీటిమట్టం చేరిన తరువాత తూర్పు పడమర కాలువల నీటి విడుదల చేస్తామని ద్వారా అధికారులు తెలిపారు. సాగర్‌, శ్రీశైలం నుంచి వరద ఉదృతంగా ఉండడంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌ల్లో నీటి నిలువ గంటగంటకు పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు పరిధిలోని ముంపు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

మరోవైపు పులిచింతలకు విపరీతమైన వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్థి స్థాయి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీంతో జిల్లాలోని మూడు ముండలాల్లో ముంపు ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్‌ చేశారు. చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నది పరీవాహకంలో నీటి ఉధృతి ఎక్కడి వరకు వస్తుందోనని రెవెన్యూ, పోలీసు అధికారులు అంచనా వేసి ముంపు గ్రామాల్లో అక్కడక్కడ ఉన్న ప్రజలను దూర ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు. ముంపు ప్రాం తాల్లో ఎవరైనా ఉంటే తరలివెళ్లాలని ఎస్పీ రావి రాల వెంటకటేశ్వర్లు ప్రకటన విడుదల చేశారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి దిగువకు 2లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయడంతో సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది.

ఆదివారం సాయంత్రం వరకు పులిచింతల ప్రాజెక్టులో 1.01 టీఎంసీల నీరుంటే సామవారం అర్ధరాత్రి వరకు 17 టీఎం సీల వరకు ప్రాజెక్టులోకి నీరొచ్చింది. ప్రాజెక్టు పూర్థి స్థాయి సామర్థ్యం 45.77 టీఎంసీలు. వరదతో ఒక్కరోజులోనే ఈప్రాజెక్టు నిండనుంది. దీంతో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా డెల్టా ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లు అందనున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వరద మిగిల్చిన వ్యధ

కడలిలో కల్లోలం

కొండముచ్చుకు ఫోన్‌ నచ్చింది! 

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

అమరావతికి పార్లమెంట్‌ ఆమోదం లేదు!

ఎక్కడ నుంచైనా రేషన్‌..వలసదారులకు వరం!

రాత పరీక్ష పాసైతే చాలు!  

నౌకలో భారీ పేలుడు

మృత్యు ఘోష!

కృష్ణమ్మ పరవళ్లతో అన్నదాతల్లో ఆనందం

నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

అమరావతి అప్పులు కన్సల్టెన్సీలకు ఫలహారం

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు 26 నుంచి సర్వే

గేట్లు దాటిన ‘కృష్ణమ్మ’

కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాం

కేసీఆర్‌ను కలిసిన వైవీ సుబ్బారెడ్డి

జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు..!

ఈనాటి ముఖ్యాంశాలు

రాయలసీమ అభివృద్ధికి సహకరిస్తాం : కేసీఆర్‌

చంద్రబాబును కలిసిన బోండా ఉమ

ఆ వార్తలను ఖండించిన కోటంరెడ్డి

మణిక్రాంతి మొండానికి అంత్యక్రియలు

అన్నదాతల ముఖాల్లో ఆనందాలు నింపేలా..

అత్తివరదరాజు స్వామిని దర్శించుకున్న కేసీఆర్‌

విశాఖ సాగర తీరంలో భారీ అగ్నిప్రమాదం

కొత్త పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే..

కన్నాకు టీడీపీ అక్రమాలు కన్పించలేదా?

‘గ్రామ వాలంటీర్లందరూ సచివాలయ సైనికులు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌బాస్‌’సీరియస్‌.. శివజ్యోతి, రోహిణిలకు షాక్‌

క్రేజీ కాంబినేషన్‌

ఎవరి సలహాలూ వినొద్దన్నారు

సినిమా గురించి ప్రేక్షకులే మాట్లాడతారు

నేనొచ్చేశా!

ఎంత ఖర్చుపెట్టినా ఆ పేరు రాదు