తెలంగాణ ఇస్తామని చెప్పాం.. తెచ్చాం

4 Aug, 2013 02:56 IST|Sakshi

 మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లపై ఉన్న విశ్వాసంతో తెలంగాణ తెచ్చేది..ఇచ్చేది తా మేనని చెప్పామని, ఆ మేరకు హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లా ల తెలంగాణ ప్రకటన తెచ్చామని మంత్రి డీకే అరుణ పేర్కొన్నా రు. మరో ఐదునెలల కాలవ్యవధిలో కొత్తరాష్ట్రం ఏర్పడుతుం దని ధీమావ్యక్తం చేశారు. అయితే టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖ ర్‌రావుకు రాష్ట్ర విభజన ఇష్టం లేదని ఘాటుగా విమర్శించా రు. తెలంగాణ సంబరాల్లో భాగంగా డీసీసీ ఆధ్వర్యంలో శనివా రం జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో విజయోత్సవ సభ ని ర్వహించారు.
 
 అంతకుముందు కాంగ్రెస్ నాయకులు కొత్తూరు నుం చి చేపట్టిన కార్ల భారీర్యాలీ షాద్‌నగర్, బాలానగర్, రాజాపూర్, జ డ్చర్ల మీదుగా పాలమూరుకు చేరింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి అరుణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటవుతున్న తరుణంలో సీమాంధ్ర ప్రజలను కేసీఆర్ రెచ్చగొటే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌కు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. అధికార పార్టీలో ఉంటూనే ప్రభుత్వంతో పోరాడి రాద నుకున్న ప్రత్యేకరాష్ట్రాన్ని సాధించిన ఘనత తమకే దక్కిందన్నారు. జిల్లాకు చెందిన నేతలతో ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ఏర్పాటును ప్రభావితం చేయగలిగిన కేంద్ర నాయకులందరినీ కలిసి తెలంగాణ ఆవశ్యకతను వివరించి ఒప్పించామన్నారు.
 
 ఉద్యమంలో ముందున్నాం..
 తొలివిడత ఉద్యమ సమయంలో సమైక్యవాది అయిన డీకే సత్యారెడ్డిని ఎదిరించి తన భర్త భరతసింహారెడ్డి తెలంగాణ కోసం పోరాడారని,  అప్పట్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేసి తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి రాజారామేశ్వర్‌రావును గెలిపించారని మంత్రి అరుణ గుర్తుచేశారు. తన పుట్టినిల్లు కూడా తెలంగాణ కోసం పాటుపడిందేనని పేర్కొన్నారు. మలిదశ ఉద్యమంలో మంత్రిగా ఉన్న తనను పదవికి రాజీనామా చేయించి, రాజకీయంగా దెబ్బదీయాలనుకున్న ప్రత్యర్థులు ఎత్తుగడలకు తాను భయపడలేదని చెప్పారు.  
 
 తెలంగాణ తొలి ముఖ్యమంత్రి
 డీకే అరుణ
  తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా డీకే అరుణను నియమించే విధంగా అధిష్టానంపై ఒత్తిడి తెస్తామని మాజీఎంపీ మల్లు రవి అన్నారు. ఆమె సీఎం అయితే జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి వేగవంతమవుతుందని ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి కొనియాడారు. మంత్రి పదవిలో ఉన్న జూపల్లి కృష్ణారావు, ఎంపీ జగన్నాథం అధిపత్యం కోసం పార్టీని వీడినా అరుణమ్మ పార్టీని ఏకతాటిపై నడిపించారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అబ్రహాం, ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపీ విఠల్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు రాంమ్మోహన్‌రెడ్డి, వంశీకృష్ణ, పీసీసీ సభ్యుడు బుర్రి వెంకట్రాంరెడ్డి, మాజీ జెడ్పీచైర్మన్ దామోదర్‌రెడ్డి,  నేతలు మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, దిలీపాచారి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు