పెరిగిన చలి.. జాగ్రత్తలు తప్పనిసరి

16 Nov, 2018 07:37 IST|Sakshi
మంచు దుప్పట్లో పాతపట్నం

పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

వ్యాధులు ప్రబలే అవకాశం

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

శ్రీకాకుళం, పాతపట్నం: శీతాకాలం ప్రారంభమైంది. చలిగాలులతో జనం వణుకుతున్నారు. జిల్లాలో గత కొద్దిరోజులుగా రాత్రి  ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోతున్నా యి. సుమారు 21 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుండడంతో జనం అవస్థలు పడుతున్నారు. వాతావరణంలో చోటు చేసుకున్న ఈ మార్పులతో ప్రజలు అనారోగ్య సమస్యలబారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బంది తప్పదంటున్నారు. శీతాకాలంలో చర్మ సంబంధిత, శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయి. పిల్లలు జలు బు, దగ్గుతో బాధపడుతుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యు డ్ని సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తే నిమోనియాకు దారి తీసే ప్రమాదం ఉంది. పెద్దలతో పోలిస్తే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వద్ధులు, బాలింతలు చలికి తట్టుకోలేని పరిస్థితి.  ముక్కుకు విధిగా మాస్కులు ధరించాలి. వర్షాకాలంలో పోలిస్తే చలికాలంలో గుండెనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హృద్రోగ బాధితులు చలిలో తిరగకపోవడం మంచిది. సూర్యోదయం తర్వాతే వాకింగ్‌కు వెళ్లడం ఉత్తమం.

 పిల్లలను బయట తిప్పవద్దు
సాధ్యమైనంత వరకు చిన్నపిల్లలను ఆరుబయట తిప్పరాదు. రాత్రి పడుకునే ముందు శరీరం పొడిబారకుండా ఏదైనా మంచి లోషన్‌ రాయాలి. కాళ్లు, చేతులను ఉన్ని దుస్తులతో కప్పి ఉంచాలి. పిల్లలు జలుబు, దగ్గుతో బాధపడుతుంటే నిర్లక్ష్యం చేస్తే నిమోనియాకు దారి తీసే ప్రమాదం ఉంది. పిల్లలకు సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి.
–డాక్టర్‌ మంచు మధన్‌మోహన్, చిన్నపిల్లల వైద్య నిపుణుడు, కొరసవాడ, పాతపట్నం

నీరు బాగా తాగాలి
రాత్రి వేళ శరీరానికి వేడినిచ్చే లోషన్లను రాసుకుంటే మంచిది. పెదాలను ఉమ్మితో తడపకుండా వాటిపై లిప్‌గార్డ్‌ను రుద్దాలి. మంచి నీరు సమృద్ధిగా తాగాలి. లేదంటే శరీరంలో నీటి శా తం తగ్గి చర్మకాంతి తగ్గుతుంది. సోరియాసిస్‌ బాధితులు స్నానానికి ముందు ఒంటికి ఆయిల్‌ పట్టించాలి. చల్లటి నీరుతో కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. –డాక్టర్‌ కర్రి రామమూర్తి, చర్మవైద్య నిపుణులు, ప్రభుత్వాస్పత్రి, పాతపట్నం

చలితో గుండెకు చేటే..
చలికాలంలో శరీరంలో కార్టిసోహార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తనాళాల సైజును తగ్గించడంతోపాటు రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. వేసవి, వర్షాకాలాలతో పోలిస్తే చలి కాలంలో చాలా మందికి గుండె నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. హృద్రోగ బాధితులు చలిలో తిరగకపోవడం మంచిది. వీరు సూర్యోదయం తర్వాతే వాకింగ్‌ చేయాలి.–డాక్టర్‌ బి.సూర్యారావు, డీసీహెచ్‌ఎస్, శ్రీకాకుళం.

మరిన్ని వార్తలు