జనం పెరిగితే రణమే

11 Jul, 2014 01:55 IST|Sakshi
జనం పెరిగితే రణమే

విజయనగరం ఆరోగ్యం: ఆకలి బాధలు, దొంగతనాలు, దోపిడీలు, నిరుద్యోగ సమస్య, ఆరోగ్య ఇబ్బందులు, పేదరికం, నివాస సమస్య..మంద ఎక్కువైతే మజ్జిగ పలచనైందన్న చందాన జనాభా పెరిగితే  ఏర్పడే ఇబ్బందులు ఇవి. కుటుంబమైనా దేశమైనా అభివృద్ధి చెందాలంటే అది జనాభాపైనే అధారపడి ఉంటుంది. శు క్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రజల్లో జనాభా నియంత్రణపై అవగాహన పెరిగినప్పటికీ అది  ఇంకా సరిపోనట్టు గోచరిస్తోంది. ప్రపంచ జనాభాలో మొదటి స్థానం చైనాది కాగా రెండో స్థానం భారతదేశానిది. ప్రస్తుత భారత దేశజనాభా 128 కోట్లుకాగా ఆంధ్రప్రదేశ్ జనాభా4.5 కోట్లు ఉంది. జిల్లా  జనాభా ప్రస్తుతం 23,68,219. ఇందులో పురుషులు 11,62,136 కాగాస్త్రీలు 12,06,083మంది.
 
 ఆరు ఏళ్ల లోపు బాలురు 1,23,311కాగా బాలికలు 1,18,357 మంది . 4954 మంది. జనాభా ఇలా పెరుగుతూ పోతుండడం వల్ల దేశంలో చాలామంది మూడు పూటలా కడుపు నిండా తినడానికి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం అన్నింటి కంటే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఒక ఉద్యోగం సాధించడానికి వందలాది మంది పోటీ పడుతున్నారు. జనాభా ఎక్కువగా ఉండడం వల్ల  దేశంలోనూ, జిల్లాలోనూ ప్రజలకు తాగడానికి నీరు కూడా పూర్తిస్థాయిలో అందకపోవడం వల్ల నీటి యుద్ధాలు కూడా తప్పని పరిస్థితి కనిపిస్తోంది. 1987లో తీవ్రమైన ఆహార కొరత, అంటువ్యాధులు, నిరుద్యోగం పెరిగిపోవడంతో  జనాభాను నియంత్రించాలనే ఉద్దేశంతో  ఆ ఏడాది జూలై 11వ తేదీ నుంచి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఏటా జనాభా పెరుగుదల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.   
 
 జనాభా తక్కువగా ఉంటే..
 జనాభా తక్కువైతే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మంచి ఆహారం దొరుకుతుంది. మంచి ఇళ్లు కట్టుకోగలరు. ఉద్యోగం అందరికీ దొరుకుతుంది. పేదరికం తగ్గి ప్రతి ఒక్కరూ  స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవించగలుగుతారు.  
 
 అవగాహన చేపడుతున్నాం
 జనాభా నియంత్రణకోసం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, ఆడపిల్ల 21 సంవత్సరాలు, పురుషుడు 25 సంవత్సరాలకు వివాహం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. అంతేకాకుండా బిడ్డకు, బిడ్డకు మధ్య కనీసం ఐదు సంవత్సరాలు ఎడం పాటించేలా కుటుంబ సంక్షేమ తాత్కాలిక పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తున్నాం. బడిలో బిడ్డ ఒడిలో బిడ్డ అనే నినాదంతో పనిచేస్తున్నాం. ప్రతి ఏడాదీ కళాశాలల్లోనూ సీహెచ్‌సీ స్థాయిల్లో జనాభా పెరుగు దల వల్ల కలిగే అనర్థాల గురించి వివరిస్తున్నాం.               యు.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌ఓ
 

మరిన్ని వార్తలు