దోచుకోవడంపైనే చంద్రబాబు దృష్టి

15 Oct, 2018 10:09 IST|Sakshi

ఎన్నికల హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?

కలెక్షన్లలో మంత్రి సోమిరెడ్డి బిజీ 

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి    

వెంకటాచలం: రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకోవడంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టాడని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కనుపూరులో ఆదివారం రావాలి జగన్‌ – కావలి జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కాకాణి మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుంటడంతో ప్రజలు చంద్రబాబుకు ఓటు ఎందుకు వేయకూడదు, జగన్‌కు ఎందుకు ఓటు వేయాలనే విషయంపై ఆలోచన చేయాలన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో బాబు ఒక్కటైనా నెరవేర్చాడా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ దగ్గర నుంచి, పక్కాఇళ్లు, ఫించన్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, డ్వాక్రా రుణాల మాఫీ వీటిలో దేనిని కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. మంత్రి పరిటాల సునీత తాము డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని అసెంబ్లీలోనే చెబితే బాబు మాత్రం డ్వాక్రా రుణాలు మాఫీ చేశామని చెప్పుకొంటున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం దృష్టి దోచుకోవడంపైనే ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై లేదన్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి మళ్లీ పునరావృతం కావాలంటే జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చేందుకు ప్రజలు ఆలోచన చేయాలన్నారు. 

సోమిరెడ్డి దోచుకుంటున్నాడు
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కలెక్షన్‌లో బిజీగా ఉంటే ఆయన కుమారుడు కౌంటింగ్‌లో బిజిబిజీగా ఉన్నారేతప్ప ప్రజాసేవలో కాదన్నారు. రైసుమిల్లర్ల వద్ద రూ.50 కోట్లు ముడుపులు తీసుకుని రైతులకు మద్దతు ధర కల్పించకుండా తీవ్ర అన్యాయం చేయడం దగ్గర నుంచి నీరు – చెట్టు, రైతు రథం కమీషన్లతో రూ.కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వ్యక్తిని నాలుగుసార్లు ప్రజలు తిరస్కరించాంటే ఆయన పనితీరు ఏవిధంగా ఉందో తెలుస్తుందన్నారు. అధికారంలో లేకపోయినా ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతీ సమస్యను పరిష్కరించేందుకు నిరంతరం కృషిచేస్తున్నాను కాబట్టే నియోజకవర్గ ప్రజలు తనను ఆదరిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి కనుపూరు కోదండరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, మండల కన్వీనర్‌ కె.చెంచుకృష్ణయ్య, యువజన విభాగం మండల అధ్యక్షులు ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, మండల బూత్‌ కన్వీనర్‌ కట్టంరెడ్డి విజయకుమార్‌రెడ్డి, జిల్లా నాయకులు నాటకం శ్రీనివాసులు, కట్టంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, చెంగన కిష్టయ్య, పి.మస్తానయ్య, ఆదూరి బద్రినాథ్, చింతంరెడ్డి వెంకటరమణయ్య, షేక్‌ షాజహాన్, ఖాజామస్తాన్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు