మావోయిస్టులకు ఆయుధాలు: యువకుడి అరెస్టు

20 Dec, 2014 19:05 IST|Sakshi

మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శరత్ రెడ్డి అనే యువకుడు చెన్నైలో ఎంబీఏ చదివాడు. అతడి వద్ద తుపాకి తయారీకి సంబంధించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఇటీవలి కాలంలో అంతగా లేవు. తూర్పు ఏజెన్సీతో పాటు.. ఏవోబీ ప్రాంతంలో మాత్రం కొంతవరకు అలజడి ఉండేది. అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి పశ్చిమ ఏజెన్సీలో కూడా మావోయిస్టులకు ఆయుధాల సరఫరా లాంటి ఘటనలు బయటపడటంతో ఉలిక్కిపడుతున్నారు.

మరిన్ని వార్తలు