చిత్తూరు: ఓసారి ఈ చిత్రం చూడండి. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, హెల్మెట్ వేసుకోండి అని ట్రాఫిక్ పోలీసులు ఓ వైపు చెబుతూనే ఉన్నా జనాలకు మాత్రం ఈ తరహా పైత్యం ఇంకా తగ్గలేదు. చిత్తూరు నగరం మురకంబట్టులో ఓ బైక్ మీద ఐదుగురు వెళుతూ సాక్షి కెమెరాకు చిక్కారు. మరి ఇలా వెళితే ప్రమాదాలు జరగవా? ఏ చిన్న తేడా వచ్చినా వీరి ప్రాణాలతో పాటు ఎదురుగా వచ్చే ప్రాణాలకూ ముప్పే కదా?
-ఫోటో: ఎన్.మురళి, చిత్తూరు