BIS Helmets: ఇకపై ఇవి వాడరాదు.. ఎందుకంటే..?

27 Oct, 2023 10:11 IST|Sakshi

పోలీస్‌ బలగాల రక్షణ కోసం తయారు చేసే హెల్మెట్లతో పాటు బాటిల్డ్‌ వాటర్‌ డిస్పెన్సర్‌లు, డోర్‌ ఫిట్టింగ్‌లకు ప్రభుత్వ నాణ్యతా ప్రమాణాలు పాటించేలా నిబంధనలు తీసుకొచ్చారు. దేశ రక్షణకోసం, ప్రజల శ్రేయస్సుకోసం నిరంతరం పని చేసే పోలీస్‌ దళాలు మరింత పటిష్ఠంగా పనిచేసేలా చూడాలని ప్రభుత్వం తెలిపింది. అందులో భాగంగానే వారు వినియోగించే వస్తువులు మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోబుతున్నట్లు ప్రకటించింది. 

నాసిరక ఉత్పత్తులు దేశంలోకి  దిగుమతి కాకుండా నిరోధించాలని చెప్పింది. దేశీయ తయారీకి ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) అక్టోబరు 23న పోలీస్‌ దళాలు, సివిల్‌ డిఫెన్స్‌, వ్యక్తిగత భద్రతా నిబంధనలు 2023, బాటిల్డ్‌ వాటర్‌ డిస్పెన్సర్‌ల నిబంధనలు 2023, డోర్‌ ఫిట్టింగ్స్‌ నిబంధనలు 2023 పేరిట మూడు వేర్వేరు నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. ఈ ఆదేశాల ప్రకారం బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) మార్క్‌ లేని ఈ వస్తువుల ఉత్పత్తి, విక్రయం, దిగుమతులు, నిల్వ చేయరాదు. నోటిఫికేషన్‌ జారీ చేసిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

మరిన్ని వార్తలు