నేటి వైఎస్ జగన్ పర్యటన రద్దు

22 Oct, 2014 01:34 IST|Sakshi
నేటి వైఎస్ జగన్ పర్యటన రద్దు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలోని తుపాను బాధితుల్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులపాటు పరామర్శించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల బుధవారం నాటి పర్యటన రద్దయింది. ఈ విషయూన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఓ ప్రకటనలో తెలిపారు. బాధితుల్ని పరామర్శించేందుకు జగన్ సోమవారం రాత్రి శ్రీకాకుళం చేరుకున్న విషయం తెలిసిందే. మంగళ, బుధవారాల్లో వివిధ నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ఖరారు చేశారు. అయితే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలలో మందుగుండు సామగ్రి కంపెనీలో పేలుడు సంభవించి 18 మంది మృంతి చెందిన విషయూన్ని జీర్ణించుకోలేకపోయారు. అక్కడి నేతల ద్వారా మరింత సమాచారం అందుకున్న జగన్ మంగళవారం రాత్రి పర్యటనను కుదించుకుని కాకినాడ బయల్దేరారు. దీంతో రెండో రోజైన బుధవారం పర్యటన రద్దయిందని ధర్మాన పేర్కొన్నారు. నాగుల చవితి తరువాత మరోమారు జగన్ జిల్లాకు రానున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు
 శ్రీకాకుళం అర్భన్: తుపాను, వరదలతో నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు  వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన జిల్లా పర్యటనను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కృతజ్ఞతలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు