దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

4 Oct, 2019 18:23 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాలక్ష్మి అలకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ తొలిసారిగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం వైఎస్‌ జగన్‌ వెంట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు.


అంతకుమందు ప్రకాశం బ్యారేజ్‌ మీదుగా దుర్గగుడికి చేరకున్న సీఎం వైఎస్‌ జగన్‌ను.. అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతంతో ఆలయంలోకి ఆహ్వానించారు. సీఎం వైఎస్‌ జగన్‌ అమ్మవారిని దర్శించుకునే సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణ, రూ. 100 టికెట్‌ క్యూలైన్లలోని భక్తులు యథావిధిగా అమ్మవారిని దర్శించుకునే సౌకర్యం కల్పించారు. వీఐపీ క్యూలైన్లను మాత్రం కొద్దిసేపు నిలిపివేశారు. 

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌ : (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు