మాఫీ పేరుతో మాయ చేసిన బాబు

25 Sep, 2018 13:17 IST|Sakshi
రాజంపేట : బైక్‌ ర్యాలీలో పాల్గొన్న ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులు

నవరత్నాలతో  నవశకం  

’రావాలి జగన్‌–కావాలి జగన్‌‘లో నేతలు

సాక్షి కడప : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు పంట, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని.. హామీ ఇచ్చి మాయ చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆరోపించారు. సోమవారంప్రొద్దుటూరు, కడపలో ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, అంజద్‌బాషా, కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కె.సురేష్‌బాబు, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, బద్వేలు సమన్వయకర్త డాక్టర్‌ వెంకట సుబ్బయ్య  మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను ఏదో ఒక రకంగా చంద్రబాబు మోసం చేశారని వారు దుయ్యబట్టారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే నవరత్నాల పథకాలతోనే ప్రజలకు నవశకం ప్రారంభమవుతుందని వారు తెలియజేశారు.

ప్రొద్దుటూరు రామేశ్వరంలోని మట్టిమసీదువీధి, శాంతికుమారివీధి తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఇంటింటికి తిరుగుతూ నవరత్నాల కరపత్రాలను అందజేస్తూ.. చంద్రబాబు మోసాలను తెలియజేస్తూ కదిలారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర మూడువేల కిలోమీటర్లు పూర్తయిన సందర్బంగా ఎమ్మెల్యే రాచమల్లు కేక్‌ కట్‌ చేసి సంబ రాలు చేసుకున్నారు. కడప నగరం3 డివిజన్‌లోని రామాంజనేయపురం వరదకాలనీ, ఆచారి కాల నీ, యానాది కాలనీల్లో ‘రావాలి జగన్‌– కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజద్‌బాష, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు తదితరులు నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే  వైఎస్‌ జగన్‌ నేతృత్వం లో రాజన్న రాజ్యం వస్తుందని తెలియజేశారు.

రాజంపేటలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆ«ధ్వర్యంలో  బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పట్టణమంతా అన్ని ప్రాంతాల్లోనూ కలియ తిరిగారు. బద్వేలులో సమన్వయకర్త డాక్టర్‌ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి గుంతపల్లి రోడ్డు వైఎస్సార్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీ ముగిసింది. రాయచోటిలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ నాయకులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో భారీ కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు