ఢిల్లీకి తరలిన వైఎస్సార్ సీపీ శ్రేణులు

16 Feb, 2014 04:04 IST|Sakshi
ఢిల్లీకి తరలిన వైఎస్సార్ సీపీ శ్రేణులు

 ఢిల్లీకి తరలిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
 గుత్తి,  : అనంతపురం జిల్లా గుత్తి రైల్వేస్టేషన్ శనివారం జై జగన్, జై సమైక్యాంధ్ర నినాదాలతో మార్మోగింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మహిళా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, జిల్లా అధికార ప్రతినిధి ఆలుమూరు శ్రీనివాసరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో జిల్లా నుంచి తరలివచ్చిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు శనివారం ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో 17న చేపట్టనున్న సమైక్య ధర్నాలో పాల్గొనడానికి తాము వెళ్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు శంకరనారాయణ పేర్కొన్నారు. గుత్తి నుంచి మూడు బోగీల్లో పార్టీ శ్రేణులు బయలుదేరినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీకి వెళ్లినవారిలో  నాయకులు దిలీప్‌కుమార్‌రెడ్డి, పసుల నాగరాజు, వెన్న పూసపల్లి రామచంద్రారెడ్డి, తిప్పేపల్లి ఓబులరెడ్డి, గుత్తి మండల నాయకులు సీవీ రంగారెడ్డి, గురుప్రసాద్ యాదవ్, మామిళ్లచెరువు నాగిరెడ్డి, గాజులపల్లి మనుమంతరెడ్డి, ఎర్రగుడి శంకరరెడ్డి తదితరులు ఉన్నారు.
 ‘సమైక్య’ కింగ్ జగనే
 రాష్ట్ర విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పునరుద్ఘాటించారు.  శనివారం ఆయన గుత్తి రైల్వేస్టేషన్‌లో సమైక్య ధర్నా (చలో ఢిల్లీ) రైలు ఎక్కడానికి ముందు పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మతో కలసి విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ తప్పా మిగిలిన రాజకీయ పార్టీలు పరోక్షంగా రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నాయని విమర్శించారు. తమ పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి మాత్రం మొదట్నుంచీ సమైక్యాంధ్ర తప్పా మరో మాట అనడం లేదన్నారు. జగన్‌ను స్ఫూర్తిగా తీసుకొని తామంతా సమైక్యాంధ్ర పరిరక్షణకు ఉద్యమిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 17న ఢిల్లీలో చేపడుతున్న ‘సమైక్య ధర్నా’ను కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నిర్వహిస్తామన్నారు.
 
 

మరిన్ని వార్తలు