రచ్చబండ, పల్లెనిద్ర

12 Nov, 2017 10:47 IST|Sakshi

ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో శనివారం పలు నియోజకవర్గాలలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. 

సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం మండలం కోండ్రు కోట గ్రామంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఎస్టీసెల్‌ అధ్యక్షుడు తెల్లం బాలరాజు పాల్గొన్నారు. చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో శనివారం పల్లెనిద్ర కార్యక్రమాన్ని నియోజకవర్గ కన్వీనర్‌ పుప్పాల వాసుబాబు ప్రారంభించారు. 

దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పాదయాత్రతో చేబ్రోలులోని పిట్టవారి వీధిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. దెందులూరు మండలం కొమరేపల్లిలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమంలో కన్వీనర్‌ కొఠారు రామచంద్రరావు పాల్గొన్నారు. గోపాలపురం మండలం హుకుంపేటలో పల్లెనిద్ర కార్యక్రమంలో కన్వీనర్‌ తలారి వెంకట్రావు, మండల కన్వీనర్‌  పడమటి సుభాష్‌చంద్రబోస్‌ పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పల్లె నిద్ర చేపట్టారు. ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్‌ నర్సింహరాజు నేతృత్వంలో ఆకివీడు మండలంలో పెదకాపవరం వరకు మోటారుసైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. పెదకాపవరంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. పల్లెనిద్ర నిర్వహించారు. 

మరిన్ని వార్తలు