ఎమెస్కో ప్రచురించిందే అసలైన పుస్తకం

12 Jul, 2020 05:43 IST|Sakshi

‘నకిలీ పీడీఎఫ్‌’ సర్క్యులేషన్‌పై డీజీపీకి ఫిర్యాదు చేసిన వైవీ సుబ్బారెడ్డి 

సాక్షి, అమరావతి: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ తన భర్తపై రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్‌’ పుస్తకానికి, అదే పేరుతో సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ అవుతున్న పీడీఎఫ్‌ ఫైలుకు ఏమాత్రం సంబంధం లేదని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమెస్కో పబ్లిషర్స్‌ సంస్థ ప్రచురించిందే అసలైన పుస్తకమని ఆయన స్పష్టం చేశారు. ఈ పుస్తకంలోని అంశాలు, సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న పీడీఎఫ్‌ ఫైలులోని అంశాలు వేర్వేరుగా ఉన్నాయన్నారు. ఆ ఫైల్‌ను దురుద్దేశంతో సర్క్యులేట్‌ చేస్తుండటంపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశామని, అభిమానులు దీన్ని గమనించాలని తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా