ఘనంగా ప్రారంభమైన శారదపీఠం వార్షికోత్సవాలు

30 Jan, 2020 10:08 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8గంటలకు గురువందనంతో ప్రారంభమైన ఉత్సవాలు గణపతి పూజ అనంతరం రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. కాగా నేటి నుంచి ఐదు రోజుల పాటు ఈ వార్షికోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల మేలు కోసమే నివాస చతుర్వేద హావనం, రాజశ్యామల యాగాలు చేపట్టామిన పేర్కొన్నారు. లోక శాంతి కోసం నివాస చతుర్వేద హావనం చేపట్టినట్లు తెలిపారు. సోషల్‌ మీడియాను అడ్డుపెట్టుకొని హైందవ సమాజంపై కుట్రపూరితంగా దాడికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. లోకంలో అశాంతి తొలగాలన్నదే శారదాపీఠం ధ్యేయమని స్వరూపానందేంద్ర తెలిపారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు విశాఖ శారదపీఠాన్ని సందర్శించి అనంతరం స్వామి స్వరూపానంద్రేంద్ర సరస్వతి ఆశీస్సులు అందుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో చతుర్వేదహావనం, సాయంత్రం రాజశ్యామల స్వరూప శారదా, చంద్రమౌళీశ్వరుల పీఠపూజ, సాంస్కృతిక కార్యక్రమాలలో వైవీ దంపతులు పాల్గొననున్నారు. విశాఖశారద పీఠం వార్షికోత్సవాల్లో ఒడిశా స్పీకర్‌ సూర్యనారాయణ పాత్రో, మంత్రి అవంతి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ పాల్గొన్నారు

>
మరిన్ని వార్తలు