కృష్ణా జలాల వివాదంపై నేటి భేటీ రద్దు

8 Dec, 2023 05:39 IST|Sakshi

వచ్చే నెలలో రెండు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్రం సమావేశం

సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వివాదం పరి ష్కారమే అజెండాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో శుక్రవారం నిర్వహించాల్సిన సమావేశాన్ని కేంద్రం రద్దు చేసింది. మళ్లీ భేటీ ఎప్పుడన్నది తర్వాత తెలియజేస్తామని రెండు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గురువారం సమాచారం ఇచ్చారు. హక్కులను కాపాడుకోవడం కోసం రాష్ట్ర భూభాగంలోని సాగర్‌ స్పిల్‌ వే, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను గత నెల 30న ఏపీ ఆధీనంలోకి తీసుకోవడంతో రెండు రా ష్ట్రాల మధ్య వివాదం ఉత్పన్నమైంది.

సాగర్‌ వివాదంతోపాటు కృష్ణా జలాల పంపిణీ, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై రెండు రాష్ట్రాల సీఎస్‌లతో ఈనెల 6న సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఈనెల 8కి వాయిదా వేశారు. ఇక తెలంగాణలో కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. ఈక్రమంలో శుక్రవారం నిర్వహించాల్సిన సమావేశాన్ని రద్దు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. 

>
మరిన్ని వార్తలు