-

ప్రధాని మోదీకి ఘనస్వాగతం.. నేడు శ్రీవారిని దర్శించుకోనున్న మోదీ 

27 Nov, 2023 04:17 IST|Sakshi
రేణిగుంట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికిన గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్న ప్రధాని.. నేటి ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న మోదీ  

ప్రధాని హోదాలో తిరుమలకు రావడం ఇది నాలుగోసారి 

సాక్షి, తిరుపతి/రేణిగుంట (తిరుపతి జిల్లా)/తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆదివారం రాత్రి తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, సీఎం వైఎస్‌ జగన్‌ పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించి సాదర స్వాగతం పలికారు.

ప్రధానికి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, డాక్టర్‌ గురుమూర్తి, రెడ్డెప్ప, జీవీఎల్‌ నరసింహారావు, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం, వరప్రసాద్‌రావు, వెంకటేగౌడ, ఎమ్మెల్సీ కల్యాణచక్రవర్తి, వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, తిరుపతి నగర మేయర్‌ డాక్టర్‌ శిరీషా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య­దర్శి జవహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, జేసీ డీకే బాలాజి, తిరుపతి కమిషనర్‌ హ­రి­త, పలువురు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు.

అనం­తరం ప్రధాని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక కా­న్వాయ్‌ ఆపి బీజేపీ శ్రేణులకు అభివాదం చేశారు. ఆ తర్వాత ఆయన రోడ్డు మార్గాన తిరుమలకు బయల్దేరి వెళ్లారు.  

తిరుమలకు చేరుకున్న ప్రధాని 
ఇక తిరుమలకు చేరుకున్న ప్రధాని మోదీకి శ్రీ రచనా అతిథిగృహం వద్ద ఈఓ ధర్మారెడ్డి, రచనా టెలివిజన్‌ డైరెక్టర్‌ తుమ్మల రచనా స్వాగతం పలికారు. శ్రీవారిని ఆయన సోమవారం ఉదయం దర్శించుకుంటారు. ప్రధాని హోదాలో మోదీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి.  

మరిన్ని వార్తలు