గ్రహం అనుగ్రహం (08-01-2020)

8 Jan, 2020 06:13 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి శు.త్రయోదశి రా.2.27 వరకుతదుపరి చతుర్దశి, నక్షత్రం రోహిణి ప.2.54 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం ఉ.6.32 నుంచి 8.12 వరకు, తిరిగి రా.8.33 నుంచి 10.11 వరకు, దుర్ముహూర్తం ప.11.44 నుంచి 12.28 వరకు, అమృతఘడియలు... ప.11.31 నుంచి 1.10 వరకు.

సూర్యోదయం :    6.37
సూర్యాస్తమయం    :  5.37
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం: వ్యయప్రయాసలు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమాధిక్యం.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్థిరాస్తి వృద్ధి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మిథునం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాలి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యస్థితి.

కర్కాటకం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. పనులు సజావుగా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

సింహం:  వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

కన్య: కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. దైవదర్శనాలు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం.

తుల: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

వృశ్చికం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కుల నుంచి బయటపడతారు.«

దనుస్సు: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

మకరం: సన్నిహితులో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు.వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

కుంభం: మిత్రులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి.  నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. పనుల్లో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు