Rasi Phalalu: ఈ రాశి వారికి వ్యవహారాలలో విజయం

9 Nov, 2023 05:57 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.ఏకాదశి ఉ.9.32 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఉత్తర రా.9.45 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.34 వరకు, తదుపరి ప.2.23 నుండి 3.08 వరకు, అమృత ఘడియలు: ప.1.50 నుండి 3.36 వరకు, మతత్రయ ఏకాదశి, రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు  యమగండం :  ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం : 6.05 సూర్యాస్తమయం :  5.23.

మేషం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

వృషభం... వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు అధికమవుతాయి. కష్టించినా ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మిథునం... సన్నిహితులతో మాటపట్టింపులు. పనులు ముందుకు సాగవు. శ్రమాధిక్యం. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం.... వ్యవహారాలలో పురోగతి. ఆస్తి, ధనలాభాలు. ఇంటర్వ్యూలు రాగలవు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు.

సింహం... వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తరుణయత్నాలు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. దైవచింతన.

కన్య... చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

తుల.... ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం.. కార్యజయం. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభ సూచనలు. ప్రముఖుల నుంచి పిలుపు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు.... వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. విందువినోదాలు. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

మకరం..... వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కుంభం.... శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

మీనం... సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

మరిన్ని వార్తలు