గ్రహం అనుగ్రహం(09-03-2020)

9 Mar, 2020 06:09 IST|Sakshi

శ్రీ వికారినామ సంవత్సరం. ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఫాల్గుణ మాసం. తిథి పౌర్ణమి రా.12.00 వరకు, తదుపరి బ.పాడ్యమి. నక్షత్రం పుబ్బ రా.2.08 వరకు, తదుపరి ఉత్తర. వర్జ్యం ప.11.10 నుంచి 12.38 వరకు. దుర్ముహూర్తం ప.12.31 నుంచి 1.21 వరకు, తదుపరి ప.2.55 నుంచి 3.41 వరకు.

అమృత ఘడియలు రా.8.07 నుంచి 9.44 వరకు
సూర్యోదయం: 6.18 సూర్యాస్తమయం: 6.04; రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు.
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: ఇంటాబయటా ఒత్తిడులు. దూర ప్రయాణాలు. ఆదాయం తగ్గి నిరాశ కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఒyì దుడుకులు. విద్యార్ధులకు నిరుత్సాహం. దైవచింతన.

వృషభం: అదనపు ఆదాయం తగ్గుతుంది. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విరోధాలు. ఆరోగ్య సమస్యలు. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఆలయ దర్శనాలు.

మిథునం: పట్టుదల, ధైర్యంతో ముందడుగు వేస్తారు. మీశక్తియుక్తులతో శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. నూతన పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. కళాకారులకు సత్కారాలు.

కర్కాటకం: కుటుంబసమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహనయోగం. బంధువుల నుంచి ధనలాభం. యత్నకార్యసిద్ధి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం: ఆకస్మిక ప్రయాణాలు. వృథా ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కృషి తగ్గ ఫలితం ఉండదు. ఆలయ దర్శనాలు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.

కన్య: వ్యవహారాలలో తొందరపాటు. దూరప్రయాణాలు. ఆదాయానికి మించి ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. కళాకారులకు ఒత్తిడులు.

తుల: పొరపాట్లు సరిదిద్దుకుంటారు. యత్నకార్యసిద్ధి. అత్యంత విలువైన సమాచారం. ఆప్తులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వేడుకలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

వృశ్చికం: కృషి చేసినా ఫలితం కనిపించదు. పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. భూవివాదాలు. ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. దైవదర్శనాలు.

ధనుస్సు: చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. శుభవార్తా శ్రవణం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మకరం: అప్పులు చేయాల్సివస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. అగ్రిమెంట్లలో జాప్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. నిరుద్యోగుల యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం.

కుంభం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. అదనపు రాబడి. కొత్త పనులు సజావుగా పూర్తి.స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి.

మీనం: వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. యత్నకార్యసిద్ధి. ఇంటిలో శుభకార్యాలు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. వాహనయోగం. కీలక నిర్ణయాలు. కళాకారులకు సత్కారాలు.– సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు