గ్రహం అనుగ్రహం (18-02-2020)

18 Feb, 2020 06:11 IST|Sakshi

శ్రీ వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువుమాఘ మాసం, తిథి బ.దశమి సా.5.55 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం జ్యేష్ఠ ఉ.8.53 వరకు, తదుపరి మూల, వర్జ్యం సా.4.48 నుంచి 6.24 వరకు, దుర్ముహూర్తం ఉ.8.47 నుంచి 9.32 వరకు, తదుపరి రా.10.58 నుంచి 11.47 వరకుఅమృతఘడియలు..రా.2.21 నుంచి 3.56 వరకు

సూర్యోదయం :    6.30
సూర్యాస్తమయం    :  5.59
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

వృషభం: విచిత్ర సంఘటనలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మిథునం: కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆదరణ లభిస్తుంది. నూతన ఒప్పందాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభ సూచనలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

కన్య: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృశ్చికం: కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. అనుకోని ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి గందరగోళం.

ధనుస్సు: శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

మకరం:  వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. ఏ పని చేపట్టినా విజయమే. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మీనం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. సోదరులు, సోదరీలతో సఖ్యత. విందువినోదాలు. నూతన ఉద్యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు