గ్రహం అనుగ్రహం (19-11-2019)

19 Nov, 2019 05:56 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.సప్తమి ప.1.45 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం ఆశ్లేష రా.8.21 వరకు, తదుపరి మఖ, వర్జ్యం ఉ.9.44 నుంచి 11.15 వరకు, దుర్ముహూర్తం ఉ.8.23 నుంచి 9.07 వరకు, తదుపరి రా.10.27 నుంచి 11.18 వరకు అమృతఘడియలు... సా.6.50 నుంచి 8.20 వరకు.

సూర్యోదయం :    6.10
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

భవిష్యం
మేషం: ఆర్థిక లావాదేవీలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభం: పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు కొంత తొలగుతాయి.

సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.

కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

తుల: పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

వృశ్చికం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరాశ.

ధనుస్సు: సన్నిహితులతో అకారణంగా వివాదాలు. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. నిరుద్యోగులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

కుంభం: కొన్ని వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. సేవాభావంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: పనుల్లో ప్రతిష్ఠంభన. దూరప్రయాణాలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

– సింహంభట్ల సుబ్బారావు 

మరిన్ని వార్తలు