గ్రహం అనుగ్రహం(29-04-2020)

29 Apr, 2020 06:14 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి శు.షష్ఠి ఉ.11.04 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం పునర్వసు రా.10.06 వరకు, తదుపరి పుష్యమి వర్జ్యం ఉ.10.06 నుంచి 11.44 వరకు, దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.23 వరకు, అమృతఘడియలు... రా.7.41 నుంచి 8.44 వరకు.

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం    :  6.14
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

గ్రహఫలం
మేషం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం.  ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.

మిథునం..వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కర్కాటకం: పనులు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు.

సింహం: శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

కన్య: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు కూడా చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృశ్చికం: రుణయత్నాలు సాగిస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

ధనుస్సు: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

మకరం: బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు.

మీనం: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ధనవ్యయం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. ఆలయ దర్శనాలు.

మరిన్ని వార్తలు