ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐపై సీబీఐ విచారణకు డిమాండ్

2 Oct, 2015 00:09 IST|Sakshi

 న్యూఢిల్లీ: ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అవినీతికూపంగా మారిందని ఫార్మా, ఆహార పదార్థాల తయారీ సంస్థల సమాఖ్యలు ఆరోపించాయి. ఈ వ్యవహారాలపై సీబీఐ విచారణ జరిపించాలని నేషనల్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటైన 11 అసోసియేషన్లు డిమాండ్ చేశాయి. బహుళ జాతి కంపెనీల ఒత్తిడితో ప్యాక్డ్ ఫుడ్ విక్రయాలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సానుకూలంగా వ్యవహరిస్తోందని, అదే సాధారణ ట్రేడరు అన్ని ప్రమాణాలు పాటించినా అనుమతులు లభించడం లేదని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.
 
  ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రైవేట్ కంపెనీగా నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తోందని, సంస్థ కమిటీల్లో అసలు వినియోగదారులకు గానీ వ్యాపార సంస్థలకు గానీ ప్రాతినిధ్యమే లేదని ఆయన ఆరోపించారు. దీంతో ఆహార పరిశ్రమ దివాలా తీసే పరిస్థితి నెలకొందన్నారు. ఇటీవలి సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా 2013 నుంచి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలన్నింటినీ వెంటనే ఉపసంహరించాలన్నారు. ఉత్పత్తుల అనుమతుల కోసం తీసుకున్న రూ.80 కోట్ల మొత్తాన్ని కూడా రీఫండ్ చేయాలని పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు