344 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలపై నిషేదం

15 Mar, 2016 01:28 IST|Sakshi
344 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలపై నిషేదం

జాబితాలో ఫైజర్ కోరెక్స్, అబాట్ ఫెన్సెడిల్
న్యూఢిల్లీ: దగ్గు సిరప్‌లతో సహా మొత్తం 344 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించింది. వీటి వినియోగం మానవులకు హానికరమని, వీటికి సురక్షితమైన ప్రత్యామ్నాయ ఔషధాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ నిషేధం తక్షణం వర్తిస్తుందని వివరించింది. నిషేధించిన ఔషధాలను తయారు చేస్తున్న కంపెనీలకు గతంలో షోకాజ్ నోటీసులు ఇచ్చామని, వివరణ ఇవ్వడానికి తగిన సమయం కూడా ఇచ్చామని ఆరోగ్య మం త్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సూచనల మేరకే ఈ 344 ఔషధాలను నిషేధించామని వివరించారు. ఇలా నిషేధించిన వాటిలో ఫైజర్ కంపెనీ కోరెక్స్ బ్రాండ్ కింద విక్రయించే  దగ్గు సిరప్, అబాట్ కంపెనీ ఫెన్సెడెల్ పేరుతో విక్రయించే దగ్గు సిరప్‌లు కూడా ఉన్నాయి. కోరెక్స్ తయారీ, విక్రయాలను తక్షణం నిలిపేశామని ఫైజర్ కంపెనీ, ఫెన్సెడిల్ విక్రయాలను ఆపేశామని అబాట్ కంపెనీలు పేర్కొన్నాయి.  రెండు లేదా అంతకుమించిన యాక్టివ్ డ్రగ్స్‌ను ఒక సింగిల్ డోస్ రూపంలో తయారు చేసే ఔషధాలను ఫిక్స్‌డ డోస్ కాంబినేషన్ ఔషధాలుగా వ్యవహరిస్తారు.

మరిన్ని వార్తలు