ఆంధ్రప్రదేశ్‌లో 971 కంపెనీలు స్ట్రయిక్‌ ఆఫ్‌

14 Dec, 2019 04:36 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 971 కంపెనీలు స్ట్రయిక్‌ ఆఫ్‌ అయ్యాయి. 2016–17, 2017–18 వరుసగా రెండేళ్లు వార్షిక రిటర్న్‌లు, బ్యాలెన్స్‌ షీట్లను ఫైల్‌ చేయని కారణంగా సెక్షన్‌ 248 ప్రకారం ఈ కంపెనీలను స్ట్రయిక్‌ ఆఫ్‌ చేసినట్లు ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీసెస్‌ (ఐసీఎల్‌ఎస్‌) సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. తొలిసారిగా  స్ట్రయిక్‌ ఆఫ్‌ అయిన కంపెనీల బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేసినట్లు చెప్పారు. కంపెనీల డేటాతో పాటు బ్యాంక్‌ అకౌంట్, పాన్‌ నంబర్ల వివరాలను ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్, ఆర్‌బీఐ, ఐటీ, జీఎస్‌టీ కార్యాలయాలకు పంపించామన్నారు.

5 వేల మంది డైరెక్టర్లు డిస్‌క్వాలిఫై...
2015–16, 2016–17, 2017–18 వరుసగా మూడేళ్ల పాటు బ్యాలెన్స్‌ షీట్లను సమర్పించని వివిధ కంపెనీలకు చెందిన సుమారు 5 వేల మంది డైరెక్టర్లను అనర్హులుగా (డిస్‌క్వాలిఫై) ప్రకటించారు.వీరిలో అక్షయ గోల్డ్, అగ్రిగోల్డ్‌ వంటి కంపెనీల డైరెక్టర్లున్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు