అమెజాన్ గ్లోబల్ స్టోర్

14 Oct, 2016 00:29 IST|Sakshi
అమెజాన్ గ్లోబల్ స్టోర్

దేశీయ కరెన్సీలో అంతర్జాతీయ ఉత్పత్తుల కొనుగోలు

 న్యూఢిల్లీ: అమెజాన్ డాట్ ఇన్ తన కస్టమర్లకు మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెరికా వెబ్‌సైట్‌పై విక్రయించే వస్తువులను దేశీయ కరెన్సీలో కొనుగోలు చేసేందుకు వీలుగా గ్లోబల్ స్టోర్‌ను ప్రారంభించింది. దీని వల్ల దేశంలోని వినియోగదారులకు అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన 40 లక్షలకుపైగా ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని అమెజాన్ ప్రకటించింది.

 గ్లోబల్ స్టోర్‌తో భారత్‌లోని కస్టమర్లు వేలాది బ్రాండ్ల నుంచి 40 లక్షలకు పైగా అంతర్జాతీయ ఉత్పత్తుల్లో తమకు నచ్చినది ఎంపిక చేసుకోవచ్చునని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ అన్నారు. ప్రస్తుతం అమేజాన్ అమెరికా సైటుపై లభిస్తున్న ఉత్పత్తులను మాత్రమే అందుబాటులో ఉంచామని, తర్వాత మరిన్ని కేటగిరీల్లో, మరిన్ని దేశాల ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అమెజాన్ యూఎస్ సైటుపై కొనుగోలు చేసే అవకాశం గతంలోనూ ఉందని, కాకపోతే డాలర్లలో చెల్లించాల్సి వచ్చేదన్నారు. ఇకపై రూపాయల్లోనే చెల్లించవచ్చని తెలిపారు.

>
మరిన్ని వార్తలు