ఆండ్రాయిడ్‌ ‘ఓ’ లాంచింగ్‌

21 Aug, 2017 18:52 IST|Sakshi

శాన్‌ఫ​నాన్సిస్కో: అమెరికాలో ఒకవైపు అరుదైన  సూర్యగ్రహణం సంభవించబోతోంది. మరోవైపు సెర్చి ఇంజీన్‌ దిగ్గజం  గూగుల్ తన తరువాత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈరోజు (ఆగస్టు 21న) లాంచ్‌ చేయనుంది.  తదుపరి వెర్షన్  'ఆండ్రాయిడ్‌ ఓ'   అధికారికంగా సోమవారం అమెరికాలో విడుదల చేయబడుతోంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ ఓ (O) ను  ఆగస్టు 21వ తేదీన మ‌ధ్యాహ్నం 2.40 గంట‌ల‌కు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 22వ తేదీన రాత్రి 12.10 గంటలకు)  దీన్ని విడుదల చేస్తోంది.

1918 తరువాత మొదటిసారి  సూర్యగ్రహణం అమెరికా అంతా  ఏర్పడబోతోంది.  అటు న్యూయార్క్ సిటీలో జరగనున్న ఓ ఈవెంట్‌లో గూగుల్ తన కొత్త ఓఎస్ ఆండ్రాయిడ్ 8.0ను లాంచ్‌ చేయనుంది. ఆగ‌స్టు 21వ తేదీన ఏర్ప‌డ‌నున్న సంపూర్ణ సూర్యగ్రహణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆండ్రాయిడ్ ఓ ను విడుదల చేస్తున్నట్టు గూగుల్ అధికారికంగా ప్రకటించింది. ఈ చారిత్రాత్మక సహజ దృగ్విషయాన్ని అనుభవించటానికి ఇది సహాయపడుతుందని గూగుల్‌ వెల్లడించింది.   ఈ ఈవెంట్‌ను లైవ్‌లో వీక్షించాలంటే android.com/o సైట్‌ను సందర్శించవచ్చని గూగుల్ తెలియజేసింది.

కాగా  ఆండ్రాయిడ్ 8.0 వెర్షన్‌కు అప్‌డేటెడ్‌ గా ఒక కొత్త  పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్, ఆపరేటింగ్ సిస్టం (OS) కు కొత్త నోటిఫికేషన్ డాట్స్‌ తో పాటు బ్లూటూత్ ఆడియో ప్లే బ్యాక్‌ను  మెరుగుపర్చి పరిచయం చేస్తుందని భావిస్తున్నారు.  ఆండ్రాయిడ్ ఓ (O)కు ఓరియో(Oreo) అక్టోపస్‌( Octopus) ఆర్బిట్‌( Orbit) అనే పేర్లు పెట్టనుందనే అంచనాలు వెలువడ్డాయి. అయితే  ఓరియో అనే ఖాయం కావచ్చని  తెలుస్తోంది.  మరోవైపు  తాజా  గణాంకాల ప్రకారం ఆండ్రాయిడ్‌ డివైస్‌లలో  సుమారు 85 శాతం గత ఏడాది విడుదల చేసిన  ఆండ్రాయిడ్‌  నౌగాట్‌కు  అప్‌గ్రేడ్ కాలేదు.

 

మరిన్ని వార్తలు