ఆపిల్‌పై దాడులు : ఆ ఫోనే టార్గెట్‌

24 Nov, 2017 17:27 IST|Sakshi

సియోల్‌ : దక్షిణ అమెరికాలో సూపర్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ ఎక్స్‌ లాంచింగ్‌కు ముందు ఆపిల్‌ సంస్థలపై రెగ్యులేటర్లు దాడులు జరిపాయి. అయితే ఈ దాడులపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఐఫోన్‌ ఎక్స్‌ విజయాన్ని నాశనం చేయడం కోసం దక్షిణ కొరియా అథారిటీలు ఇలాంటి కుట్రలకు పన్నాగాలు పన్నుతున్నారేమోనని లండన్‌కు చెందిన మెట్రో లేటు రిపోర్టు చేసింది. శుక్రవారం నుంచి దక్షిణ కొరియాలో ఐఫోన్‌ ఎక్స్‌ విక్రయానికి వచ్చింది. ఈ విక్రయానికి ముందు ఆపిల్‌ కార్యాలయాలపై రెగ్యులేటర్లు దాడులు నిర్వహించారు.

ఈ వారం ప్రారంభంలో ఇన్వెస్టిగేటర్లు ఆపిల్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారని, వ్యాపార పద్దతుల గురించి ప్రశ్నలు వేశారని రిపోర్టు తెలిపింది. ఆపిల్‌, ఇతర కంపెనీల నుంచి వస్తున్న పోటీ నుంచి స్థానిక కంపెనీలను రక్షించాలని కొరియా ఫెయిర్‌ ట్రేడ్‌ కమిషన్‌ కోరుతోంది. దక్షిణ కొరియాలో ఆపిల్‌ ఉత్పత్తులకు బాగా గిరాకి ఉంటుంది. స్థానిక దిగ్గజ కంపెనీలైన శాంసంగ్‌, ఎల్‌జీ ఉత్పత్తుల కంటే కూడా ఆపిల్‌ ఉత్పత్తులకే డిమాండ్‌ ఎక్కువ. అయితే స్థానిక ఫోన్‌ నెట్‌వర్క్‌లతో ఆపిల్‌ అన్యాయపూర్వకమైన కాంట్రాక్టులను ఏర్పరుచుకుందని ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్టిగేటర్లు 2016లోనే విచారణ చేపట్టారు. 

మరిన్ని వార్తలు