ఇక ఏటీఎంలోనూ టాక్స్ రిటర్న్స్ ఫైల్

4 Jun, 2016 19:51 IST|Sakshi

న్యూఢిల్లీ : ఇక వార్షిక పన్ను రాబడులను ఏటీఎంలోనే ఫైల్ చేసుకోవచ్చట. ఈ-ఐటీఆర్ లు ఏటీఎంలోనే ఫైల్ చేసుకునేలా ఏటీఎం ఆధారిత ధృవీకరణ వ్యవస్థను ఆదాయపు పన్ను విభాగం ఆవిష్కరించింది. ఈ వ్యవస్థను పన్నుచెల్లింపుదారులకు అందుబాటులో ఉంచింది. పేపర్ లెస్ సిస్టమ్ ను ప్రోత్సహించే క్రమంలో ఆదాయపు పన్ను విభాగం ఈ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఎక్కడైతే పన్ను చెల్లింపుదారు అకౌంట్ కలిగి ఉంటారో ఆ బ్యాంకు ఏటీఎంలకు ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్(ఈవీసి)ను జెనరేట్ చేయనున్నారు.

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్ బీఐ ఈ ఏటీఎం ఆధారిత ఈ-ఫైలింగ్ టాక్స్ రిటర్న్స్ వ్యవస్థను శుక్రవారం నుంచే యాక్టివేట్ లో ఉంచింది. మిగతా బ్యాంకు ఏటీఎంలకు కూడా త్వరలోనే ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ఆదాయపు పన్ను విభాగం చెప్పింది. గత నెలే బ్యాంకు అకౌంట్ ఆధారిత ధృవీకరణ వ్యవస్థను ఆదాయపు పన్ను శాఖ ప్రవేశపెట్టింది. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ లేని వాళ్ల కోసం ఆదాయపు పన్ను శాఖ ఏటీఎం ఆధారిత ధృవీకరణ వ్యవస్థను కూడా తీసుకొచ్చింది.

మరిన్ని వార్తలు