సంగీతారెడ్డికి గౌరవ డాక్టరేట్‌

8 Sep, 2017 00:07 IST|Sakshi
సంగీతారెడ్డికి గౌరవ డాక్టరేట్‌

మక్వారీ యూనివర్సిటీ ప్రదానం
సాక్షి, హైదరాబాద్‌: ఆస్ట్రేలియాకు చెందిన మక్వారీ యూనివర్సిటీ గురువారం అపోలో హాస్పిటల్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. భారత్‌లో ఆరోగ్య సంరక్షణ కోసం చేపడుతున్న అనేక మార్పులకు, ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సమాచార సాంకేతికతలో చేస్తున్న కృషికి, నిబద్ధతకు గుర్తింపుగా ఆమెకు ఈ డాక్టరేట్‌ దక్కింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాక్క్యూరీ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ఎస్‌ బ్రూస్‌ డౌటన్‌ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.  

రెండు సంస్థల మధ్య ఒప్పందం...: మక్వారీ వర్సిటీ, అపోలో హాస్పిటల్స్‌... పరస్పర ప్రయోజనాలు కలిగించే దీర్ఘకాలిక విద్యా మార్పిడిని చేపట్టాయి. ఈ ఒప్పందంలో భాగంగా... మక్వారీ పరిధిలోని నాలుగేళ్ల డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులు.. ఇకపై హైదరాబాద్‌లోని అపోలోలో 5 నెలలపాటు నిర్వహించే క్లినికల్‌ లెర్నింగ్‌ను పూర్తి చేస్తారు. కాగా, మక్వారీ విశ్వవిద్యాలయం అందిస్తున్న ఎండీ ప్రోగ్రామ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్‌.సి.రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు