టీమిండియా ఓటమి - పారిశ్రామిక వేత్తల ట్వీట్స్ వైరల్

20 Nov, 2023 17:12 IST|Sakshi

ఇండియా మూడవ ప్రపంచ కప్ టైటిల్ సొంతం చేసుకుంటుందని ప్రారంభం నుంచి ఎదురు చూసిన భారతీయుల ఆశలు ఫలించ లేదు. ప్రపంచ కప్ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించి సంబరాలు చేసుకుంటుంటే.. యావత్ భారతం మిన్నకుండిపోయింది.

టైటిల్ సొంతం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించి ఓటమి పాలవ్వడంతో టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ సన్నివేశం చూసిన ప్రజలంతా.. ఓటమిలో అయినా గెలుపులో అయినా మేము మీ తోడుంటాం అంటూ ధైర్యం నింపారు. కొంతమంది పారిశ్రామిక వేత్తలు కూడా తమదైన రీతిలో సానుభూతి తెలిపారు.

రోహిత్ శర్మ బాధలో ఉన్న దృశ్యంపై ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ 'రాధికా గుప్తా' స్పందిస్తూ.. గొప్ప నాయకులకు కూడా కొన్ని సందర్భాల్లో ఓటమి తప్పదు. భావోద్వేగాలు బలహీనతకు సంకేతం కాదని ఆమె పోస్ట్‌ చేస్తూ.. ఎంతోమంది మీకు మద్దతుగా నిలుస్తూ ప్రేమను తెలియజేస్తున్నారని ట్వీట్ చేసింది.

ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్ పేరుతో ట్వీట్ చేస్తూ.. ది మెన్ ఇన్ బ్లూ దేశం నలుమూలల నుంచి చాలా భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చి చివరిదాకా పోరాడి మన హృదయాలను గెలుచుకున్నారు అంటూ వెల్లడించారు. ఇవి ప్రస్తుతం నెట్టింటో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తమదైన రీతిలో సానుభూతి తెలుపుతున్నారు.

మరిన్ని వార్తలు