ఏవియేషన్ లో 5/20 తొలగింపునకు సిఫార్సు?

5 Mar, 2016 01:28 IST|Sakshi
ఏవియేషన్ లో 5/20 తొలగింపునకు సిఫార్సు?

న్యూఢిల్లీ: పౌర విమానయాన రంగానికి సంబంధించి వివాదాస్పదమైన 5/20 నిబంధనను తొలగించాలంటూ అంతర్‌మంత్రిత్వ శాఖల కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం.  అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ 5/20 నిబంధనను తొలగించి, అంత ర్జాతీయ సర్వీసులు నడిపేందుకు మరో ప్రాతిపదికను పరిగణించాలని ఈ కమిటీ అభిప్రాయపడినట్లు వివరించాయి. విదేశాలకు సర్వీసులు నడపాలంటే దేశీ విమానయాన సంస్థలు దేశీయంగా అయిదేళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించి, కనీసం 20 విమానాలనైనా కలిగి ఉండాలని 5/20 నిబంధన నిర్దేశిస్తోంది. టాటా సన్స్ పెట్టుబడులతో కొత్తగా ఏవియేషన్ రంగంలోకి ప్రవేశించిన విస్తార, ఎయిర్‌ఏషియా ఇండియా సంస్థలు దీన్ని ఎత్తివేయాలని కోరుతుండగా .. జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో తదితర సంస్థలు నిబంధనను కొనసాగించాల్సిందేనంటున్నాయి.

మరిన్ని వార్తలు