ఉద్యోగులకు విప్రో ఛైర్మన్‌ లేఖ

6 Jun, 2017 15:04 IST|Sakshi
ఉద్యోగులకు విప్రో ఛైర్మన్‌ లేఖ

ముంబై: టెక్‌ దిగ్గజం విప్రో వాటాల విక్రయాలపై  వస్తున్నవార్తలపై విప్రో లిమిటెడ్  ఛైర్మన్‌ అజిమ్‌ ప్రేమ్‌జీ  అధికారికంగా స్పందించారు.  విప్రో కంపెనీని లేదా కంపెనీకి చెందిన కొన్ని యూనిట్లను విక్రయించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయని, అమ్మడానికి ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారన్న  మీడియా నివేదికలను  అజిమ్ ప్రేమ్‌జీ తీవ్రంగా  ఖండించారు. ఇవి  పూర్తిగా నిరాధారమైనవి, హానికరమైనవంటూ తోసిపుచ్చారు. ఈ మేరకు ఆయన  సంస్థ ఉద్యోగులకు ఒక లేఖను విడుదల చేశారు.

గడచిన 50 ఏళ్ళుగా, కూరగాయల నూనెల వ్యాపారంతో  ఒక చిన్న ప్రాంతీయ సంస్థగా  ఉన్న విప్రో నేడు టెక్నాలజీలో ఒక ప్రపంచ సంస్థగా ఎదుగుతున్న సంస్థను  చూస్తున్నా...ఇదే ఒరవడి ఒక ముందు కూడా కొనసాగుతుంది. ఎంతో పొటెన్షియాలిటీ ఉన్న విప్రో,  ఐటి పరిశ్రమలో ఎంతో ఆనందంగా కొనసాగుతున్నాను.  కంపెనీలో ఖాతాదారుల విజయానికి అలాగే కంపెనీ విజయానికి ఎంతో శక్తివంతమైన శక్తి ఉంది. దీనికి ఎప్పటిలాగానే విప్రో కట్టుబడి ఉందని అజీమ్ చెప్పారు.  మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవాలనీ, నిరాధారమైన ఇలాంటి పుకార్లను నమ్మవద్దంటూ లేఖలో  ప్రేమ్‌జీ ఉద్యోగులను కోరారు.  

 

మరిన్ని వార్తలు