రిషి సునాక్‌పై సుయెల్లా బ్రేవర్మన్‌ ధ్వజం: మూడు పేజీల లేఖ కలకలం

15 Nov, 2023 11:21 IST|Sakshi

మంత్రివర్గంలో అనూహ్యంగా మార్పులు చేసి, కొత్త వివాదానికి తెరలేపిన బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత, భారత్ సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ స్పందించారు. ప్రధాని సునాక్‌కు ఎవరూ మద్దతుగా లేని సమయంలో తాను ఎంతో అండగా నిలిచానని, వాగ్దానాలన్నింటినీ పక్కన బెట్టి, పాలనలో విఫలమై,  ఇపుడు తనపై వేటు వేశారంటూ ఘాటు విమర్శలతో  ఒక లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

ప్రభుత్వం నుండి వైదొలగమని కోరినందుకు ధన్యవాదాలు. ఇది బాధ కలిగించింది కానీ, బ్రిటీష్ ప్రజలు కోరికమేరకు హోం సెక్రటరీగా పని చేయడం తన అదృష్టమనీ, ఈ సందర్బంగా పౌరసేవకులు, పోలీసులు, బోర్డర్ ఫోర్స్ అధికారులు , భద్రతా నిపుణులందరికీ ఆమె ధన్యవాదాలు చెప్పారు. కొన్ని షరతులపై 2022లో  అక్టోబ్‌లో హోం సెక్రటరీగా సేవ చేయడానికి  ఆఫర్‌ని అంగీకరించాను అంటూ తన లేఖను మొదలు పెట్టారు. (వర్క్‌ ఫ్రం హోం, ఆదాయంపై సంచలన సర్వే: దిగ్గజాలు ఇపుడేమంటాయో?)

రిషి సునాక్ ప్రధాని కావడానికి తాను ఎంతో తోడ్పాడ్డానని ఆమె పేర్కొన్నారు. కీలకమైన పాలసీలపై తనకిచ్చిన దృఢమైన హామీల మేరకు ఆయనకు మద్దతిచ్చాననీ, అయితే ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి, కీలకమైన విధానాల అమల్లో విఫలమయ్యారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే దేశానికి మేలు చేస్తానని  బ్రిటన్ ప్రజలకిచ్చిన హామీలను రిషి విస్మరించాంటూ  విమర్శనాస్త్రాలు  సంధించారు.  అంతేకాదు ప్రధానిగా కొన సాగేందుకు  రిషి సునాక్ అనర్హుడంటూ మండిపడ్డారు.

అక్రమ వలసలను తగ్గించడం, ఇంగ్లీషు ఛానల్‌నుదాటకుండా వలస పడవలను ఆపడం, బయోలాజికల్ సెక్స్‌ను రక్షించేలా పాఠశాలలకు చట్టబద్ధమైన మార్గదర్శకత్వం జారీ చేయడం, ఉత్తర ఐర్లాండ్ ప్రోటోకాల్‌పై  లాంటి వాగ్దానాల్ని ఆమె  ప్రస్తావించారు. ఇది తమ పరస్పర ఒప్పందానికి ద్రోహం మాత్రమే కాదు, దేశానికి  చేసి  ద్రోహం కూడా అంటూ  మూడు పేజీల  లేఖలో బ్రేవర్మన్  ధ్వజమెత్తారు. ఎవరైనా నిజాయితీగా ఉండాలి అసలు మీ ప్లాన్లేవీ పని చేయడం లేదు, రికార్డు స్థాయిలో ఎన్నికల పరాజయాల్ని చూశాం. సమయం మించి పోతోందంటూ ఆమె ఒక రేంజ్‌లో ప్రధానిపై విరుచుకుపడ్డారు.  (రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో: కీలక పరిణామం, ఇది వాడి పనేనా?)

ఇది ఇలా ఉంటే  రిషి సునాక్‌ ప్రధానమంత్రిగా  బాధ్యతలు చేపట్టిన తర్వాత  తొలిసారి అవిశ్వాస పరీక్షను ఎదుర్కొనే  పరిస్థితి నెలకొంది. సొంత పార్టీ నుంచే ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. రిషి క్యాబినెట్‌లోని సీనియర్, సుయెల్లా బ్రేవర్మన్‌ను హోంమంత్రిగా తొలగించడాన్ని వారు తప్పు పడుతున్నారు.  గాజాపై ఇజ్రాయేల్ దాడులను వ్యతిరేకిస్తూ లండన్‌ వీధుల్లో పాలస్తీనా మద్దతుదారులు మార్చ్‌,  పోలీసుల  తీరుపై  గత వారం చేసిన వ్యాఖ్యల తర్వాత సుయెల్లాను తొలగించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు