బాహుబలి–2కు రూ.200 కోట్ల బీమా!

5 May, 2017 00:20 IST|Sakshi
బాహుబలి–2కు రూ.200 కోట్ల బీమా!

‘బాహుబలి–2’ సినిమాకి రూ.200 కోట్లమేర నిర్మాతలు బీమా చేయించారు. ప్రైవేట్‌ రంగ ఫ్యూచర్‌ జెనరాలి ఇన్సూరెన్స్‌ కంపెనీ తన ఫిల్మ్‌ ప్యాకేజ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ కింద ఈ కవరేజ్‌ను ఆఫర్‌ చేసింది. సినిమా ప్రి–ప్రొడక్షన్, పోస్ట్‌–ప్రొడక్షన్‌ సమయంలో అనుకోని ప్రమాదాల వల్ల సంభవించే నష్టాలన్నింటినీ ఈ కవరేజ్‌ భర్తీచేస్తుందని ఫ్యూచర్‌ జెనరాలి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. సినిమాలోని నటీనటులు మరణించడం, అనారోగ్యానికి గురవడం సహా సహజసిద్ధంగా లేదా ప్రమాదవశాత్తు అనుకోని విధంగా షూటింగ్‌కు అంతరాయం కలిగించే అంశాలన్నింటికీ ఈ పాలసీ వర్తిస్తుంది. షూటింగ్‌ సమయంలో పరికరాలకు డ్యామేజ్‌ జరిగితే దాన్ని కూడా పాలసీ కవర్‌ చేస్తుంది.

మరిన్ని వార్తలు