బ్యాంకింగ్‌ దన్ను- 38,000 చేరువకు

21 Jul, 2020 13:43 IST|Sakshi

సెన్సెక్స్‌ 463 పాయింట్లు అప్‌

ఇంట్రాడేలో 37,979 పాయింట్లకు

బ్యాంక్‌ నిఫ్టీ, రియల్టీ, ఆటో జోరు

ప్రధానంగా పీఎస్‌యూ, ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరగడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు స్పీడందుకున్నాయి. దీంతో మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్‌ 37,979ను తాకింది. తద్వారా 38,000 పాయింట్ల మైలురాయిపై కన్నేసింది. ప్రస్తుతం 463 పాయింట్లు జంప్‌చేసి 37,882 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో నిఫ్టీ 129 పాయింట్లు ఎగసి 11,151 వద్ద కదులుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ, రియల్టీ, ఆటో రంగాలు 2.5-1.5 శాతం మధ్య బలపడ్డాయి. ఫార్మా 1.5 శాతం, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ 0.5 శాతం చొప్పున డీలాపడ్డాయి.

బ్లూచిప్స్‌ ఇలా
నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్‌, ఐవోసీ, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్‌, ఐషర్‌, మారుతీ, ఐసీఐసీఐ, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్‌ 6-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బ్రిటానియా, ఇన్‌ఫ్రాటెల్‌, హిందాల్కో, సన్‌ ఫార్మా, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, జీ, ఎయిర్‌టెల్‌ 3-1 శాతం మధ్య డీలాపడ్డాయి.

ఐడియా వీక్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో పిరమల్‌, అంబుజా సిమెంట్‌, ఏసీసీ, ఎస్కార్ట్స్‌ 7-4 శాతం మధ్య జంప్‌చేయగా.. వొడాఫోన్‌ ఐడియా 8 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో హావెల్స్‌, క్యాడిలా హెల్త్‌, ఇంద్రప్రస్థ, టాటా కన్జూమర్‌, అరబిందో ఫార్మా, పిడిలైట్‌ 3-2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1379 లాభపడగా.. 1148 నష్టాలతో కదులుతున్నాయి. 

మరిన్ని వార్తలు