బీహెచ్‌ఈఎల్ లాభం 1,845 కోట్లు

30 May, 2014 03:06 IST|Sakshi
బీహెచ్‌ఈఎల్ లాభం 1,845 కోట్లు

 న్యూఢిల్లీ: విద్యుత్ పరికరాల ప్రభుత్వ రంగ దిగ్గజం బీహెచ్‌ఈఎల్ గతేడాది(2013-14) క్యూ4లో రూ. 1,845 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 3,233 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అయితే బీహెచ్‌పీవీని విలీనం చేసుకున్నందున ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. బీహెచ్‌పీవీని విలీనం చేసుకునేందుకు క్యాబినెట్ ఫిబ్రవరిలో ఆమోదముద్ర వేసిందని, దీంతో 2013 ఆగస్ట్ నుంచి విలీనం అమల్లోకి వచ్చిందని వెల్లడించింది.

 కాగా, రూ. 14,755 కోట్ల నికర అమ్మకాలు నమోదయ్యాయి. గతంలో రూ. 18,850 కోట్ల అమ్మకాల ను సాధించింది. విద్యుత్ రంగ విభాగం నుంచి రూ. 12,211 కోట్ల ఆదాయం లభించింది. గతంలో ఈ ఆదాయం రూ. 15,525 కోట్లుగా ఉంది. పూర్తి ఏడాదికి(2013-14) నికర లాభం 3,503 కోట్లకు చేరగా, గతంలో రూ. 6,693 కోట్లు నమోదైంది. ఇక ఆదాయం కూడా రూ. 50,045 కోట్ల నుంచి రూ. 41,192 కోట్లకు క్షీణించాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు 2.2% నష్టంతో రూ. 243 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు