ఉగాది సంబరం.. బ్రూతో ఆనందం

4 Apr, 2017 12:17 IST|Sakshi



తెలుగు ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ.. ఉగాది. ప్రేమ, సమైక్యతాభావాలను ఇది తీసుకొస్తుంది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దస్థాయిలో సంబరం చేసుకుంటారు. కొత్త సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలతో ఈ ఆనందం రెట్టింపు అవుతుంది, జీవితం మరింత విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఉగాది సంబరాలు మరింత బాగా చేసుకోడానికి బ్రూ మరో అవకాశం కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజల మధ్య గణనీయమైన మార్పును తీసుకురావడంలో బ్రూ కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు రెండు రాష్ట్రాల మధ్య అంతంత మాత్రంగానే ఉండే సంబంధాలను మెరుగు పరచాలని బ్రూ నిర్ణయించింది.

ఇందుకోసం కృష్ణా పుష్కరాలను వేదికగా తీసుకుంది. దాదాపు 3 కోట్ల మంది పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాలు చేశారు. 12 రోజుల పాటు జరిగిన ఈ సంబరాల్లో నదీ తీరం వెంట రంగులతో కూడిన సంబరాలు జరిగాయి. ఈ సంబరాలకు మరింత వన్నె తెచ్చేలా హీట్ టెక్నాలజీని ఉపయోగించిన బ్రూ.. అక్కడున్న వారందరి ముఖాల్లో చిరునవ్వులు తీసుకొచ్చింది. పుష్కరాల సందర్భంగా 430 స్టాల్స్‌ను ఏర్పాటుచేసి, 40 లక్షల కప్పుల కాఫీని, దాంతో పాటు అపార ప్రేమను పంచిపెట్టింది. ఇవన్నీ మేజికల్ కప్పులు. వాటిలో వేడిపదార్థం ఏదైనా పోస్తే.. అప్పటివరకు ముదురుగోధుమ రంగులో కనిపించిన కప్పుల మీద మంచి మంచి బొమ్మలు, వాటితో పాటు ప్రేమపూర్వక సందేశాలు బయటపడతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తమ సోదరీ సోదరుల కోసం తెలంగాణ వాసులు రాసిన సందేశాలను బ్రూ తీసుకొచ్చింది.

మొత్తం 12 రోజుల పాటు ఈ మేజికల్ కప్పులతో కాఫీని ఉచితంగా ఇస్తూ.. దాంతోపాటు పొరుగు రాష్ట్రం నుంచి ప్రేమను కూడా తీసుకొచ్చింది. ఆ కప్పుల మీద రాసిన సందేశాలు చూసి.. తాగిన ప్రతి ఒక్కరి ముఖాల మీద చిరునవ్వులు పూశాయి. ప్రతి ఒక్కరూ తాము చదవడమే కాక చుట్టుపక్కల ఉన్నవాళ్లకు కూడా ఆ సందేశాలు చూపించి, పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ప్రేమాభిమానాలకు మురిసిపోయారు. ఆ విధంగా బ్రూ విజయవంతంగా ఆ 12 రోజుల పాటు సమైక్యత, స్నేహభావాల సందేశాన్ని మోసుకొచ్చింది. బ్రూ చేసిన ఈ చిరు ప్రయత్నం జనం మోముల్లో ఎలాంటి ఆనందాన్ని నింపిందో మీరే చూడండి.. కింద వీడియో క్లిక్ చేయండి.